Sivaananda Lahari (in Telugu)

శివానందలహరి — చాకిచర్ల నాగసుదర్శన్ రావు ఎందరో మహాపురుషులు తిరుగాడిన పుణ్యభూమి మన హింధూదేశం. వారిలో ఆదిశంకరులు అగ్రగణ్యులు. వారు ప్రాత:స్మరణీయులు. దైవం మానుష రూపేణా అన్నట్లుగా 32 సంవత్సరములు ఆ మహానుభావుని పాద స్పర్శతో పునీతమైనది ఈ అవని. ఏమనుకున్నారు మరి , రూపొందిన సాక్షాత్ శంకర స్వరూపము ఆదిశంకరాచార్యులు ! ఆశేతు హిమాచలము పర్యటించి అవైదిక వాదనలు ఖండించి , మరలా వైదిక ధర్మాన్ని మనదేశములో నిలబెట్టిన కారణ జన్ములు ఆదిశంకరలు ! ఆయన భక్తి పారవశ్యం భాష్యాలు, ప్రకరణ గ్రంధాలు , స్తోత్రాలు రూపంలో కట్టలు తెంచుకొని పరవళ్లు తొక్కింది. ఆయన రచనలు యావత్ ప్రపంచాన్ని అద్వైత సిద్ధాంతము మరియు సనాతన ధర్మం వైపు దారి మళ్ళించాయి. వాటిలో శివానందలహరి ప్రధానమైనది. ఇందులో పొందుపరిచిన అత్యంత విశిష్టమైన భక్తి మార్గం గురించి ఇప్పుడు మనము తెలుసుకొందాము. అందునా కార్తీక మాసములో ఈ విశేషాలను తెలుసుకోవటము ఎంతో...

Read More